![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -819 లో.. కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు రాజ్. ఇదేంటి ఇలా ఎర్రగా ఉన్నాయని కావ్య అడుగుతుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు.. పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని తీసుకొని వచ్చానని రాజ్ అనగానే ఆ మాటలకి కావ్య మురిసిపోతుంది. ఎంత పెద్ద మగాడు అయినా తన పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడు అయిపోతాడని కావ్య అంటుంది.
మరొకవైపు రాహుల్ ఇంట్లో పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయని లెక్కలు వేసుకుంటుంటే.. అప్పుడే రుద్రాణి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ ఇంట్లో పని చేస్తే పర్మినెంట్ పనివాడిని అయిపోతానని అంటాడు. నీకేం కర్మ రా.. నువ్వు ఈ ఆస్తులకి వారసుడివి.. నీ తర్వాత నీ కూతురు వారసురాలు. ఇంకెవరికి వారసుడు రాకుండా చేస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది.
సీతారామయ్య రెడీ అవుతుంటే ఇందిరాదేవి వస్తుంది. మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.. ఎప్పుడు ఇలాగే ఉండాలి బావ అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ప్రకాష్, సుభాష్ ఇద్దరికి ధాన్యలక్ష్మి, అపర్ణ ఇంట్లో పూజకి సంబంధించిన పనులు చెప్తుంటారు. ఆ తర్వాత కావ్య కోసం అపర్ణ నెక్లెస్ తీసుకొని వస్తుంది. అది చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి ఎప్పటిలాగే ఏదో ఒకటి అంటుంటే అపర్ణ కౌంటర్ ఇచ్చి పంపిస్తుంది.
ఆ తర్వాత పంతులు గారు దుగ్గిరాల ఇంటికి వస్తారు నా కోడలు ప్రెగ్నెంట్ తనకి పుట్టబోయే బిడ్డ జాతకం చెప్పండి అని ధాన్యలక్ష్మి అనగానే అప్పు చెయ్ పట్టుకొని జాతకం చెప్తాడు. పుట్టబోయే బిడ్డ జాతకం బాగుందని చెప్తాడు. అలాగే కావ్యకి పుట్టబోయే బిడ్డ జాతకం గురించి చెప్తాడు. జాతకం బాగుందని చెప్తాడు. పుట్టని వాళ్ళ గురించి ఎందుకు గానీ పుట్టిన నా మనవరాలు జాతకం గురించి చెప్పమని రుద్రాణి అడుగుతుంది. నీ పెంపకంలో పెరుగుతుంది కాబట్టి నీలాగే అవుతుందని ప్రకాష్ అంటాడు.
తరువాయి భాగంలో వినాయకుడి పూజకి రాజ్, కావ్య కలిసి రేవతి ఇంటికి రప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |